కోటి జన్మల ఫలం.. తులసి పూజ | - | Sakshi
Sakshi News home page

కోటి జన్మల ఫలం.. తులసి పూజ

Feb 9 2026 7:30 AM | Updated on Feb 9 2026 7:30 AM

కోటి

కోటి జన్మల ఫలం.. తులసి పూజ

రత్నగిరిపై మూడో రోజుకు చేరిన పూజలు

విశేషంగా హాజరైన భక్తజనం

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పూజ ఆదివారం మూడో రోజుకు చేరింది. వేకువజామున సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వార్షిక కల్యాణ వేదికపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు పండితులు ఉదయం 7 గంటలకు ప్రత్యేక పూజలు చేసి, ప్రసాదాలు నివేదించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ 60 మంది రుత్విక్కులు 5 లక్షల తులసి దళాలతో విష్ణు సహస్ర నామాలతో స్వామి వారిని అర్చించారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మరో 5 లక్షల తులసి దళాలతో పూజలు చేశారు. వేదాశీస్సులు అందజేసి పవళింపు సేవతో రెండో రోజు కార్యక్రమాలు ముగించారు.

షామియానా తొలగించారు

‘కోటి తులసి పూజకు శ్రీకారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన వార్తలో ఈ షామియానా కారణంగా భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించింది. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకూ షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై కూడా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఈఓ వి.త్రినాథరావు స్పందించారు. ఆయన ఆదేశం మేరకు ఆ షామియానాను సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు.

రత్నగిరి కిటకిట

వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత, విశ్రాంత మండపాలు భక్తులతో రద్దీగా మారాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. సత్యదేవుని వ్రతాలు 3,800 జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని రథ సేవను ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

కోటి జన్మల ఫలం.. తులసి పూజ1
1/3

కోటి జన్మల ఫలం.. తులసి పూజ

కోటి జన్మల ఫలం.. తులసి పూజ2
2/3

కోటి జన్మల ఫలం.. తులసి పూజ

కోటి జన్మల ఫలం.. తులసి పూజ3
3/3

కోటి జన్మల ఫలం.. తులసి పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement