మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్యాయత్నం

Feb 7 2026 9:40 AM | Updated on Feb 7 2026 9:40 AM

మహిళ ఆత్మహత్యాయత్నం

మహిళ ఆత్మహత్యాయత్నం

పెద్దాపురం (సామర్లకోట): అప్పుల బాధ తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. పాత పెద్దాపురం బొమ్మల గుడి వీధికి చెందిన కె.శేషమ్మ (50) అక్కడి రాయచెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై మౌనిక హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని శేషమ్మను రక్షించారు. గజ ఈతగాళ్లను పంపి ఆమెను రక్షించారు. శేషమ్మ కుమార్తె అప్పులు చేసి తీర్చకపోవడంతో శేషమ్మపై అప్పుల వారి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. శేషమ్మకు ఎస్సై మౌనిక కౌన్సెలింగ్‌ ఇచ్చి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement