జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

జిల్ల

జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ

కాకినాడ లీగల్‌: జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్‌లోని సాంకేతిక లోపాలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు క్రయవిక్రయదారులకు ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి అక్రమాలకూ తావుండదని చెప్పారు. ఎటువంటి లోపాలూ లేకుండా వేగవంతంగా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసాదరావు 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. అనంతరం వివిధ ఉద్యోగోన్నతులు పొంది, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లా రిజిస్ట్రార్‌గా కాకినాడలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసాదరావును జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లు–1, 2, ఆర్‌వీ రామారావు, పీఎస్‌వీఎస్‌ఎస్‌ వీరభద్రరావు, ఇతర సబ్‌ రిజిస్ట్రార్లు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.

బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శుల

నియామకం

పిఠాపురం: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వెంగళి సుబ్బారావు, పైలా కృష్ణమూర్తిలను రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది.

చార్విక చికిత్సకు దాడిశెట్టి

రాజా ఆర్థిక సాయం

తొండంగి: కాలేయ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి చార్విక చికిత్సకు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గురువారం రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. కోన ప్రాంతానికి చెందిన చార్విక చికిత్స నిమిత్తం అద్దరిపేటకు చెందిన యువత దాతలను ఆశ్రయించి విరాళాలు సేకరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయం గమనించిన దాడిశెట్టి రాజా తన వంతు సాయాన్ని తునిలోని తన కార్యాలయంలో అద్దరిపేట యువతకు, చిన్నారి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్‌ తదితరులున్నారు.

రూ.10 లక్షల గంజాయి పట్టివేత

వై.రామవరం: అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నుంచి మండలంలోని కోట, చవిటిదిబ్బలు గ్రామాల మీదుగా రాజమహేంద్రవరానికి మినీ వ్యాన్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన బాబుల్‌ హంతాల్‌, ముబారాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ 1
1/1

జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement