గాండ్రింపు ఆగింది..
చిక్కదు.. దొరకదు.. అన్నట్టుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. ఎట్టకేలకు పట్టుబడింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లో నక్కిన పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, అది అక్కడి నుంచి తప్పించుకుని, సాయంత్రానికి సమీపంలోని పశువుల పాకలో నక్కింది. అక్కడి నుంచి అది తప్పించుకోవడానికి వీలు లేకుండా.. ఆ పాక చుట్టూ అధికారులు వల పన్ని, చివరకు ట్రాంక్విలైజర్‌తో మత్తు మందు ఇచ్చి, బంధించారు. దీంతో, గత నెల 31న సీతానగరం మండలంలో మొదలైన టైగర్ టెర్రర్‌కు తెర పడింది. – వివరాలు 8లో..


