● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు | - | Sakshi
Sakshi News home page

● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

● ఇంక

● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు

మాచవరం నుంచి చిరతపూడి వెళ్లే ప్రధాన పంట కాలువ చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మందు సీసాలు, పశు కళేబరాలతో నిండిపోయింది. అయినా ప్రభుత్వం, పాలకులు చోద్యం చూస్తున్నారు. వాటిని తొలగించాలని ఇరిగేషన్‌ అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ వ్యర్థాలతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

–అంబాజీపేట

పొగబెట్టారండోయ్‌..

రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం నల్లని పొగ కమ్మేసింది. ఇది ఆకాశంలో మేఘంలా రావులపాలెం సెంటర్‌ వరకూ వ్యాపించింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జి కింద గోదావరిలో పాత ఇసుక ర్యాంపు బాట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలతో పాటు, తారు లాంటి వ్యర్థాలకు నిప్పంటించారు. దీంతో బ్రిడ్జి అంతా పొగతో నిండిపోయింది. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. –రావులపాలెం

నిలపడేలా ఎందుకో!

నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తగా కారణంగానే ఎందరో ప్రాణాలు పోతున్నాయి. అయినా ఇలా ఆటో వెనుక ఇలా నిలబడి ప్రయాణం చేయడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చింతూరు – కూనవరం రహదారిలో శనివారం ఓ ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వెనుక డోరుపై మహిళలను సైతం నిలబెట్టి తీసుకెళ్లారు.

–చింతూరు

● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు    
1
1/2

● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు

● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు    
2
2/2

● ఇంకెన్నాల్‌.. ఈ పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement