‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్‌ | - | Sakshi
Sakshi News home page

‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్‌

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్‌

‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్‌

మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో చిత్రీకరించిన పాన్‌ ఇండియా సినిమా పుష్ప ద రైజింగ్‌ విడుదలై సూపర్‌ హిట్‌ కావడంతో మన్యం ప్రాంతంపై ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగింది. మారేడుమిల్లి మండలం గుడిస, చింతూరు మండలం ఫోర్‌ బై ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ అధిక శాతం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ సమయంలో గుడిస ప్రాంతంలోని ఒంపులు తిరిగే ఎర్రటి ఘాట్‌ రోడ్‌పై వాహనాలు వెళ్లే దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. చింతూరు మండలం ఫోర్‌ బై రిజర్వాయర్‌ వద్ద ఈ సినిమాలోని సామీ, సామీ సాంగ్‌తో పాటు హీరో, హీ రోయిన్‌ నడుమ చిత్రీకరించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు పుష్ప–2 సినిమాలోని మరికొన్ని సన్నివేశాలను మారేడుమిల్లి, తులసిపాక సమీపంలోని సోకిలేరువాగు ప్రాంతాల్లో తీశారు. ఈ ప్రాంతాల్లో నిత్యం షూటింగ్‌లు జరుగుతుండడంతో స్థానిక యువతకు సైతం క్యారెక్టర్‌ అర్టిస్టులుగా నటించే అవకాశం లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement