నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం

Feb 17 2026 7:26 AM | Updated on Feb 17 2026 7:26 AM

నేత్ర

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం

సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద రథోత్సవాన్ని సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిపై ఉంచి ఊరేగింపుగా ఆలయం నుంచి గాంధీచౌక్‌కు తీసుకు వచ్చారు. ఆలయ పండితుల వేదమంత్రాల మధ్య స్వామి, అమ్మవార్లను పూలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన రథంపై ఉంచారు. గాంధీచౌక్‌లో రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాల ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు, ఈఓ బళ్ల నీలకంఠం, డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల బాబు, గుణ్నం చంద్రమౌళి, బొడ్డు వెంకటరమణచౌదరి, నిమ్మకాలయ రంగనాగ్‌, చైర్మన్‌ కంటే జగదీష్‌మోహన్‌రావు రథోత్సవాన్ని ప్రారంభించారు. పట్టణ పురవీధుల నుంచి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడవునా భక్తులు ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు. బుధవారం రాత్రి స్వామివారి తెప్పోత్సవం, శ్రీపుష్ప యాగం నిర్వహణతో ఉత్సవాలు ముగుస్తాయి.

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం 1
1/3

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం 2
2/3

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం 3
3/3

నేత్రపర్వం.. భీమేశ్వరుని రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement