నేటి నుంచి కోటి తులసి పూజ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కోటి తులసి పూజ

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

నేటి

నేటి నుంచి కోటి తులసి పూజ

రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు

ఉదయం 7.30 గంటలకు ప్రారంభం

రోజూ 11 లక్షల తులసి దళాలతో సత్యదేవునికి అర్చన

15న రుద్రహోమంతో ముగింపు

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పత్రి పూజకు శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీకారం చుడుతున్నారు. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశా రు. పూజకు అవసరమైన తులసి పత్రి, పూలు సేకరించారు. రత్నగిరి రామాలయం పక్కనే సత్యదేవుని వార్షిక కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రజాప్రతినిధులు, దేవస్థానం చైర్మ న్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు ఈ పూజను ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ క్రతువును తు ని తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రారంభించాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో ఆయన హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 15వ తేదీ వరకూ ఈ పూజలు జరగనున్నందున ఆలోగా ఏదో ఒక రోజు స్వామీజీ వస్తారని చెప్పారు. అలాగే, ఈ పూజలో పాల్గొనాలని పలువురు ప్రజాప్రతినిధులను, ప్రముఖులను కూడా ఆహ్వానించారు. కోటి తులసి పూజతో పాటు లింగార్చన, వేద పారాయణలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ పూజలను భక్తులు తి లకించేందుకు కల్యాణ మండపం ఎదురుగా ఉన్న విశ్రాంతి మండపంలో ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్ల త రువాత జరుగుతున్న క్రతువు కావడంతో వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, ఇతర సిబ్బంది దీనిని విజయవంతం చేయాలని ఈఓ ఆదేశించారు.

ఇదీ పూజా విధానం

ఈ నెల 15వ తేదీ వరకూ ప్రతి రోజూ 11 లక్షల తుల సి దళాలతో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పూజలు చేస్తారు. మొత్తం పది రోజుల్లో కోటి తులసి దళాల అర్చనలు పూర్తి చేస్తారు. సుమారు 60 మంది వేద పండితులు, రుత్విక్కులు ఈ పూజలో పాల్గొంటారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో పూజలు చేస్తారు. చివరి రోజైన ఈ నెల 15వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ నిర్వహించే రుద్రహోమంతో కోటి తులసి పూజ పరిపూర్ణమవుతుంది.

సిబ్బందికి ప్రత్యేక విధులు

కోటి తులసి పూజ నిర్వహణకు గాను దేవస్థానం సి బ్బందికి ప్రత్యేక విధులు అప్పగించారు. పూజలు జరి గే పది రోజులూ ఆ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉండాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. 50 మంది స్వచ్ఛంద సేవకులు తులసి పత్రి రెమ్మలు విడదీసి, దళాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పూజకు ఇప్పటి వరకూ రూ.9 లక్షల వరకూ విరాళాలు వచ్చాయి. విరాళాలిచ్చేందుకు ఇంకా చాలా మంది దాతలు ముందుకొస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పూజకు రూ.12 లక్షల వరకూ వ్యయమవుతుందని అంచనా వేశారు.

నేటి నుంచి కోటి తులసి పూజ1
1/1

నేటి నుంచి కోటి తులసి పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement