దక్కని ఆధరవు
అరటికి డిమాండ్
మూడేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న అరటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నష్టాలను చవి చూసిన రైతులు అరటి సాగు తగ్గించడం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలకు ఉన్న పంట నేలకూలడం, మరికొంతమంది ప్రత్యామ్నాయంగా కంద, కోకో, పసుపు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో దిగుబడి తగ్గింది. గతంలో కోనసీమ జిల్లావ్యాప్తంగా 25,204 ఎకరాల్లో అరటి సాగు జరగగా ఇప్పుడు 13 వేల ఎకరాల్లో మాత్రమే ఉందని అంచనా. విజయవాడ, గుంటూరు, కడప తదితర మధ్య, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో కూడా రైతులు మొక్కజొన్న, మిర్చి సాగుకు మొగ్గు చూపడంతో అరటి విస్తీర్ణం తగ్గింది. విజయనగరం, సాలూరు, పార్వతీపురం తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గాలులకు అరటి చెట్లు పడిపోవడంతో ఇక్కడి అరటికి డిమాండ్ పెరిగింది. రావులపాలెం మార్కెట్ యార్డ్ ద్వారా రోజుకు 25 వేల నుంచి 30 వేల అరటి గెలల ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం 10 నుంచి 12 వేల గెలలు మాత్రమే వస్తున్నాయి. దీంతో, వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత నెలలో రూ.200 నుంచి రూ.300 వరకూ ఉన్న కర్పూరం, తెలుపు, ఎరుపు చక్కరకేళీ ధరలు ప్రస్తుతం అమాంతం రూ.700 నుంచి రూ.800కు పెరిగాయి. అరటి ధరలు మార్చి నెల వరకూ ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మహాశివరాత్రి, రంజాన్ మాసం ప్రారంభం కావడంతో పాటు, శ్రీరామనవమి, ఉగాది పండగలు ఉండడంతో ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు.
ధర ఉన్నా.. సరకు లేదు
మూడేళ్లుగా అరటికి సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ధర చుక్కల్లో ఉన్నా సరకు లేదు. రైతులు అరటి పంటకు ప్రత్యామ్నాయంగా కంద సాగుకు వెళ్లడం ఈ పరిస్థితికి కారణం. ఏప్రిల్ నాటికి అరటి పంట అందుతుంది. అప్పటి వరకూ పండగలు, పూజల కారణంగా మార్చి నెలాఖరు వరకూ ధరలు తగ్గకపోవచ్చు.
– కోనాల చంద్రశేఖర్‌రెడ్డి,
అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: జిల్లాలో కొబ్బరి, అరటి, వెనామీ రొయ్యల ధరలు పెరిగినా రైతులకు లబ్ధి చేకూరడం లేదు. మార్కెట్‌లో సరకుకు డిమాండ్ ఉండి మంచి ధర పలుకుతున్నా ఆ ఫలాలను అందుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఆశించిన స్థాయిలో ధరలు పెరిగినా దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొబ్బరికి మంచి రేటు
నాలుగు నెలలుగా ధర లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలిగిస్తూ గత నెల నాలుగో వారంలో కొబ్బరి ధరలు పెరిగాయి. అంబాజీపేట మార్కెట్‌లో పచ్చి కొబ్బరి వెయ్యికాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. గయర కాయ (పెద్ద కాయ) ధర రూ.21 వేల వరకూ పెరిగింది. అడపాదడపా తగ్గుతున్నా డిమాండ్‌ను బట్టి మార్కెట్‌లో ధర పెరుగుతోంది. పండగ సీజన్లు కావడంతో పాటు దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా కొబ్బరి డిమాండ్‌కు కారణం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కొబ్బరి సగటు దిగుబడి ఎకరాకు 1,200 నుంచి 1,400 కాయలు. దిగుబడి ఏకంగా 30 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గి ఎకరాకు 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తున్నాయి. దీనివల్ల ధరలు పెరిగాయి. ధర పెరిగినా దిగుబడి తగ్గడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు.
వనామీ రేటు పెరిగినా..
వంద కౌంట్ (కేజీకి వంద రొయ్యలు) ధర ప్రస్తుతం రూ.250 వరకూ ఉంది. ఇటీవల కాలంలో వంద కౌంట్‌కు ఈ ధర రావడం అరుదైన విషయమే. 90 కౌంట్ రూ.260 ఉండగా, 80 కౌంట్ రూ.280, 70 కౌంట్ రూ.310, 60 కౌంట్ రూ.330, 50 కౌంట్ రూ.350, 40 కౌంట్ రూ.380, 30 కౌంట్ రూ.480 వరకూ ధరలు ఉన్నాయి. 30 కౌంట్‌కు ధర రూ.480 రావడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వనామీ రొయ్యల కౌంట్‌కు మంచి ధర వచ్చింది. తరువాత ఎగుమతులపై అమెరి కా టారిఫ్‌ల కొరడాతో ధరలు పతనమయ్యాయి. అమెరికా టారిఫ్‌లు తగ్గించామని చెప్పడానికి ముందే వనామీ రొయ్యల ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి. కోన సీమ, కాకినాడ జిల్లాల్లోని తీరాన్ని ఆనుకుని సుమారు 23 వేల ఎకరాల్లో వనామీ సాగు జరుగుతోంది. కానీ, ప్రస్తుతం రైతులు ఈ ఏడాది తొలి పంటకు సిద్ధమవుతున్నారు. మొత్తం సాగులో పావు వంతు అంటే సుమారు 6 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతోందని అంచనా. రొయ్యల లభ్యత తక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు కారణమైంది.
ఎప్పుడూ ఇదే తీరు
పట్టుబడులు జరిగే సమయంలో వనామీ రొయ్యల ధరలు తగ్గడం, దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో పెరగడం సాధారణమైపోయింది. కొనుగోలుదారులు సిండికేటుగా మారడం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పుడు మార్కెట్‌కు రొయ్యల రాక తగ్గింది. దీనివల్లే వీటి ధరలు పెరిగాయి.
– దంతులూరి నానాజీరాజు,
ఆక్వా రైతు, అన్నంపల్లి.
జిల్లాలో పెరిగిన కొబ్బరి, అరటి,
వెనామీ రొయ్యల రేట్లు
అయినా రైతుకు లబ్ధి చేకూరని దుస్థితి
కొబ్బరి, అరటికి కలసి వచ్చిన
మహా శివరాత్రి, మాఘమాసం
కొబ్బరి వెయ్యికాయలు రూ.20 వేలు
40 శాతం తగ్గిన దిగుబడులు
కర్పూరం అరటి గెల రూ.700
రావులపాలెం మార్కెట్‌కు
వచ్చేది సగం గెలలు
వనామీ రొయ్యలకు
అంచనాలకు మించి ధర
ప్రస్తుతం పావు వంతు మాత్రమే సాగు
దక్కని ఆధరవు
దక్కని ఆధరవు
దక్కని ఆధరవు
దక్కని ఆధరవు
దక్కని ఆధరవు
దక్కని ఆధరవు


