శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మద్యం దోపిడీని సహించేది లేదు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణదారులు, లైసెన్స్‌దార్లతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం చట్టవిరుద్ధమని, దుకాణదార్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ, మద్యం దుకాణదారులు ఎంఆర్‌పీని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు అమలయ్యేలా ఎకై ్సజ్ అధికారులు ముమ్మర తనిఖీలు చేయాలని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.కృష్ణకుమారి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


