శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

అబద్ధపు హామీలకు అద్దంలా...

రాష్ట్ర బడ్జెట్‌ చంద్రబాబు అబద్ధపు హామీలకు అద్దం పట్టేలా ఉంది. ఎన్నికల ముందు అబద్ధపు హామీలిచ్చి మోసగించిన చంద్రబాబు నేడు బడ్జెట్‌ ద్వారా మరోసారి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్‌ ఇచ్చి ఘనకార్యం సాధించినట్లు హడావుడి చేశారు. కానీ, వారిని తెలివిగా మోసం చేసి, ప్రతి నెలా ఇస్తామన్న రూ.1,500 ఎగ్గొట్టారు. నిజానికి ప్రతి నెలా బస్సులలో తిరిగితే రూ.1,500 అవుతుందా అనే విషయాన్ని మహిళలు ఒక్కసారి ఆలోచించాలి. బడ్జెట్‌లో ఇరిగేషన్‌, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు తగిన కేటాయింపుల్లేవు. నిరుద్యోగ భృతి ఊసే లేదు.

– తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, జగ్గంపేట

అన్ని వర్గాలనూ మోసగించారు

రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలనూ మోసగించారు. ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలకు నిధులు కేటాయించ లేదు. రైతులను ఆదుకునే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం కాగా రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. సున్నా వడ్డీ ఊసే లేదు. రైతు పండించిన పంటలకు మద్దతు ధరల ప్రస్తావన లేదు. అర్హులైన ఎంతోమంది పేదలు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పథకాల్లోనూ మోసం చేస్తున్నారు.

– డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి

శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement