ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు బ్రాండ్ ‘శ్యామ్’
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఒక బ్రాండ్‌గా నిలిచిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. పోలీస్ ఉద్యోగాలకే కాకుండా ఏపీపీ ఎస్సీ గ్రూప్– 2 ఉద్యోగాల్లోను శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో ఆదివారం గ్రూపు–2 విజేతల విజయోత్సవ సభ నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఎంతో నిబద్ధతతో, క్రమ శిక్షణతో ఇనిస్టిట్యూట్‌ను తీర్చిదిద్దడంతో అనేకమందికి ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందన్నారు. సంస్థ అధినేత గుంటూరి శ్యామ్, డైరక్టర్ శైలజ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించడంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్– 2 ఫలితాల్లో 94 పోస్టులను తమ విద్యార్థులు సాధించారన్నారు. సంస్థ ప్రారంభించిన 25 ఏళ్లలో 26 వేలకు పైగా ఉద్యోగాలు సాధించామన్నారు. రెండేళ్లుగా 7210 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని వివరించారు. గ్రూప్–2 విజేతలు మాట్లాడుతూ శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నతమైన బోధనతో పాటు మోటివేషన్, భరోసా, ఆత్మస్థైర్యం కల్పించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామన్నారు. అనంతరం విజేతలతో పాటు వారి తల్లితండ్రులను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


