అబాకస్ పోటీల్లో సత్తా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అంతర్జాతీయ అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, వారిలో వెయ్యి మంది మాత్రమే ప్రతిభ చూపారని, ఇందులో 686 (68–66 శాతం) మంది తమ పాఠశాలకు చెందిన వారు ఉండటం గర్వకారణమన్నారు. ప్రతిభ చూపిన వారందరికీ హైదరాబాద్ రవీంద్రభారతిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులను శనివారం అందజేశారన్నారు. విజేతలను స్మార్ట్ జీనియస్ చైర్మన్ నల్లమిల్లి రాజ్యలక్ష్మి, డైరెక్టర్ శృతిరెడ్డి, సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్స్ అభినందించారు.


