కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన | - | Sakshi
Sakshi News home page

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

కాపుల

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన

పిఠాపురం: అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంటు ఇలా విద్యాభివృద్ధికి తోడ్పడే పథకాలకు మంగళం పాడిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం చివరకు పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. చదువు కావాలంటే మీ డబ్బుతో మీరే కొనుక్కోండి అంటూ విద్యార్థులపై రూ.కోట్ల భారాన్ని మోపింది. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. పదింతలు ప్రయాస పడి మరీ దీనిలో విజయం సాధించి తమ జీవితంలో మొదటి మెట్టు ఎక్కాలని విద్యార్థులు కలలు కంటారు. అందుకే పదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం కూడా పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను తొలి దశలోనే నట్టేట ముంచింది. వారికి అందజేయాల్సిన స్టడీ మెటీరియల్‌ను ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది. ప్రభుత్వం ఇవ్వకపోగా స్టడీ మెటీరియల్‌ను మీరే తయారు చేయించుకోండి అంటు విద్యార్థులకు పీడీఎఫ్‌లు పంపించింది. విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.2.75 కోట్ల ఆర్థిక భారం మోపింది. దీంతో విద్యార్థులు చదువు ‘కొనా’ల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం

ఈ ఏడాది మార్చి 16 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 100 రోజుల ప్రణాళికలు అంటున్నారు. దీనిలో 60 రోజులు అయిపోయింది. అయినా స్టడీ మెటీరియల్‌ మాత్రం ఇచ్చే ఆలోచనే ఉన్నట్టు కనిపించడం లేదు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేస్తోంది. పరీక్షలు సమీపిస్తున్న వేళ మెటీరియల్‌ పంపిణీ విషయంలో ఈ ఏడాది సర్కారు చేతులెత్తేసింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు భరోసా ఇస్తు ప్రతి ఏటా అక్టోబర్‌ నెలలోనే స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసేది. గత ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా విద్యార్థులపై భారం మోపడంతో చదువుకునేదెలా అంటూ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యాశాఖ తయారు చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను అందజేయాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్‌ ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవంటూ విద్యార్థులపైనే భారం వేస్తున్నారు. ఏటా జిల్లా పరిషత్‌ నుంచి స్టడీ మెటీరియల్‌ ఇచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిణీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. గత ప్రభుత్వం సకాలంలోనే విద్యార్థులకు మెటీరియల్‌ పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం మాకు సంబందం లేదన్నట్టుగా వ్యవహరించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.

పీడీఎఫ్‌లతో విద్యార్థులపై భారీగా భారం

రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో వచ్చింది. దానిని అధికారులు అలాగే స్కూళ్లకు పంపించి వాటిని ప్రింట్‌ తీసుకొని చదువుకోవాలని సూచిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి సుమారు 500 పేజీల వరకు ఉండడంతో ప్రింటింగ్‌ తీయించుకుని చదువు కోవాలంటే అదనపు భారం తప్పడం లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు నగదు వెచ్చించి ప్రింట్‌ తీయించుకోవడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో పేపర్‌కు కనీసం రూ.2 జిరాక్సు షాపుల నిర్వాహకులు తీసుకుంటున్నారు. దీంతో స్టడీ మెటీరియల్‌ తీసుకోవాలంటే రూ.1,000కి పైగానే ఖర్చు అవుతోంది. ఇలా మొత్తం విద్యార్థులపై సుమారు రూ 2.75 కోట్ల భారం పడుతుంది. వచ్చేనెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మరో 39 రోజులు మాత్రమే గడువు ఉంది.

ఉపాధ్యాయులకు విషమ పరీక్ష

చేసేదేమీ లేక, ఎవరికి చెప్పుకోలేక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీసం మా పాఠశాలకు స్టడీ మెటీరియల్‌ రాలేదని చెప్పుకోవడానికి కూడా ఉపాధ్యాయులు భయపడుతున్నారు. దయ చేసి మమ్మల్ని వీధిలో పెట్టకండి.. మేము చెప్పినట్టు తెలిస్తే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఉపాధ్యాయులు ప్రాధేయపడుతున్నారు. తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న భయంతో ‘మాకు స్టడీ మెటీరియల్‌ అందలేద’ని చెప్పుకుందామని చూసిన విద్యార్థుల నోరు నొక్కుతున్నారు ఉపాధ్యాయులు. అలాగని స్టడీ మెటీరియల్‌ లేక విద్యార్థులను ఎలా చదివించాలా అని తలపట్టుకుంటున్నారు. డిజిటల్‌గా మెటీరియల్‌ అందజేయగా ఫిజికల్‌గా మెటీరియల్‌ అందకపోవడంతో ఫీడీఎఫ్‌ను పుస్తకాల రూపంలోకి మార్చి కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేయడానికి దాతల సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సామర్లకోట: తెలుగుదేశం ప్రభుత్వం కాపులే టార్గెట్‌గా పని చేస్తోందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఇనుకొండ విష్ణుచక్రం అన్నారు. బుధవారం ఆయన సిరివాడ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభంపై ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారని, నేడు మరో కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేశారన్నారు. కూటమి నాయకుల ఆరోపించినట్టు తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని సుప్రీంకోర్టు, సీబీఐ స్పష్టం చేయడంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగానే చంద్రబాబునాయుడు అండ్‌ కో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలడంతో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శాంతియుతంగా దేవాలయా లలో పూజలు చేశామన్నారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు పూజలు చేస్తూ ఉంటే ఆయనను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రశ్నించే వారిపై దాడి చేస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేశారని, ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులే అంగీకరించారని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేక కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను ఉపయోగించుకొని కుట్ర రాజకీయం చేశారన్నారు.

పదో తరగతి స్టడీ మెటీరియల్‌

పంపిణీని ఎగ్గొట్టిన

చంద్రబాబు సర్కారు

తల్లిదండ్రులపై

రూ.2.75 కోట్ల మేర భారం

ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు

జిల్లాలో టెన్త్‌ విద్యార్థులు

పాఠశాలలు – 476

బాలికలు – 15,003 మంది

బాలురు – 14,634 మంది

మొత్తం – 29,637మంది

ఒక్కో విద్యార్థిపై పడే భారం

– రూ.1,000కి పైగా

స్టడీ మెటిరీయల్‌కు వెచ్చించాల్సిన సొమ్ము

– రూ.2.75 కోట్లు

ఇబ్బంది లేకుండా చర్యలు

జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ లేదు. డిజిటల్‌గా అందరికి మెటీరియల్‌ అందజేశాం. కొంతమేర ఇబ్బందులు ఉన్నా తగిన చర్యలు తీసుకుని విద్యార్థులు అవస్థలు పడకుండా చూస్తున్నాం. ఉపాధ్యాయులకు తగిన సూచనలు ఇచ్చాం. ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షల్లో బాగా రాసే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం.

– పి.రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన1
1/3

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన2
2/3

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన3
3/3

కాపులే టార్గెట్‌గా కూటమి ప్రభుత్వ పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement