ఒక అబద్ధం అనేకసార్లు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నాయకులు పార్టీలు మారారు తప్ప ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదు. అరెస్ట్‌లు చేసినా, జైలుకు పంపినా చెక్కు చెదరని మనోధైర్యంతో నిలబడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి వైఎస్పార్ సీపీ విజయానికి ఎస్సీలంతా కలిసికట్టుగా పనిచేస్తారు. అధికారంలో ఉండగా ఎస్సీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఎస్సీల తలరాతలు మారతాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సమావేశం దళిత శాసనసభ మాదిరిగా ఉంది.
– అంగులూరి లక్ష్మీకుమారి, మాజీ ఎమ్మెల్సీ
వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా దళితులు
దళితులు వైఎస్సార్ సీపీకి వెన్నెముకగా నిలిచారనే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. దళిత ఉన్నతాధికారులకు వేధింపులు తప్పడం లేదు. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దళిత క్రీస్టియన్లను అన్ని విధాలా మోసం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దళితులంతా కలిసి కట్టుగా ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చు.
– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, గోపాలపురం
జగన్‌ను సీఎం చేసేందుకు దళితులు శ్రమించాలి
గ్రామ గ్రామాన పర్యటించి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు దళితులంతా శ్రమించాలి. మనందరి గోల్ జగన్‌ను సీఎంను చేయడమే. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీలంటే గౌరవంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అదే స్ఫూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి అంతకు మించి చేసి మెడికల్ కాలేజీలు పెట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోంది. జగన్ పార్టీ రహితంగా అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేశారు. గ్రామాలలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో దళితులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించారు.
– పాముల రాజేశ్వరి, మాజీ శాసన సభ్యురాలు
ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేశారు
తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులను అన్నివిధాలా ఆదుకున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పెట్టి దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత జగన్‌ది. అదే పేదలకు ఇంగ్లిష్ మీడియంను దూరం చేసింది చంద్రబాబు. వైఎస్సార్ సీపీ హయాంలో హోంమినిస్టర్ తానేటి వనిత చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రస్తుత హోంమినిష్టర్ అనిత తాను సొంతంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కూటమి మంత్రులు మాటలు ఆకాశాన్నంటుతున్నాయి. దళితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా అణగదొక్కుతోంది.
– జక్కంపూడి విజయలక్ష్మి, పీఏసీఎస్ సభ్యురాలు


