ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కల్యాణ మండపం, అన్నదాన భవనానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వాడపల్లిలో ఆర్యవైశ్య ప్రముఖులను కలిసి అభినందించారు. ఆయన తొలుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జగ్గిరెడ్డి వెంట మండల పరిషత్ అధ్యక్షురాలు కుండ అన్నపూర్ణ, మార్గాని గంగాధర్, జెడ్పీటీసీ సభ్యులు బోనం సాయిబాబు, వాడపల్లి ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు, వైఎస్సార్ సీపీ నాయకులు కనుమూరి శ్రీను రాజు, మెర్ల వెంకటేశ్వరరావు, వాసు ఉన్నారు.
రబీ సీజన్‌కు సీలేరు జలాలు
మోతుగూడెం: లోయర్ సీలేరు డొంకరాయి జలాశయం నుంచి ఉభయగోదావరి జిల్లాలకు రబీ సీజన్ అవసరాలకు ఆదివారం నుంచి 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏపీ జెన్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు.


