● స్వామివారిని దర్శించుకున్న
30వేల మంది భక్తులు
● రూ.3.57 లక్షల ఆదాయం
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతి గ్రామంలో కొలువై ఉన్న శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి స్వామిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు 30వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,47,790, అన్నదాన విరాళాలు రూ.77,318, కేశ ఖండన ద్వారా రూ.6,320, తులాభారం ద్వారా రూ.400, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.25.290లతో కలిపి రూ.3,57118 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు.. ఆలయానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేయగా 5,000 మంది అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు.


