కాకినాడ లీగల్: కాకినాడ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లో 2,570 కేసులు పరిష్కరించామని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ , కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది తెలిపారు. లోక్ అదాలత్‌లో 10 బెంచ్‌లు ఏర్పాటు చేసి కేసులను పరిశీలించినట్లు వివరించారు. లోక్ అదాలత్‌లో 65 సివిల్ కేసులు, 2,471 క్రిమినల్ కేసులు, 26 ఇన్సూరెన్స్ కేసులు, 8 బ్యాంకు కేసులు పరిష్కరించామన్నారు.
ఈ లోక్ అదాలత్ బెంచ్‌లకు న్యాయమూర్తులుగా పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శ్రీదేవి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.రమేష్‌నాయుడు, 1వ జూనియర్ సివిల్ జడ్జి వి.సాహితి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మణి, మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ డి.శ్రీదేవి, నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప బాంజ్ డియో, ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ షరీన్, స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మికుమారి, స్పెషల్ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.నాగమల్లేశ్వరి వ్యవహరించారు. ఇరు పక్షాలతో మాట్లాడి కేనులను పరిష్కరించారు.


