కోనసీమ స్నోబగులు! | - | Sakshi
Sakshi News home page

కోనసీమ స్నోబగులు!

Mar 6 2026 8:13 AM | Updated on Mar 6 2026 8:13 AM

గోదావరి తీరంలో ఆకట్టుకునే మంచు అందాలు

వైనతేయ తీరంలో మంచు అందాల నడుమ పడవ ప్రయాణం

మామిడికుదురు: వైనతేయ గోదావరి నదీ తీరం పెదపట్నంలంకలో గురువారం ఉదయం మంచు ముసుగులో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మంచు అందాల నడుమ గోదావరి నదిలో పడవపై తిరిగి ఇంటికి వస్తున్న రైతులు, గోదావరి నదీ తీరంలో లంగరు వేసిన పడవలు, వర్షం తరహాలో కురుస్తున్న మంచు అందాల నడుమ పచ్చని కొబ్బరి చెట్లు, పంట పొలాలు, పంట కాలువలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement