అనుమతి లేని బాణసంచా తయారీ కేంద్రాల మూసివేత | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని బాణసంచా తయారీ కేంద్రాల మూసివేత

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

అనుమతి లేని బాణసంచా  తయారీ కేంద్రాల మూసివేత

అనుమతి లేని బాణసంచా తయారీ కేంద్రాల మూసివేత

పిఠాపురం: జరగాల్సిన నష్టం జరిగిపోయాక అధికారులు ఇప్పుడు తీరికగా తనిఖీలు ప్రారంభించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగిన నేపథ్యంలో వివిధ బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేవంటూ గొల్లప్రోలు, పిఠాపురం మండలం జల్లూరు సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలను మూసివేశారు. ఈ కేంద్రాల్లో ప్రతి రోజూ బాణసంచా అమ్మకాలు జరుగుతున్నా ఏనాడూ పట్టించుకోని అధికారులకు.. వాటికి అనుమతి లేదని ఇప్పుడు తెలిసిందా అని స్థానికులు విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement