ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

Mar 10 2026 7:19 AM | Updated on Mar 10 2026 7:19 AM

నిడదవోలు: ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు కథనం ప్రకారం.. తణుకు మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ఆకుల ప్రసాద్‌బాబు, శాంత దంపతులకు గొడవల కారణంగా విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ తల్లితో కలసి నిడదవోలు రాయిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తణుకులో పెద కుమార్తె ఆకుల నిర్మల పదో తరగతి, రెండో కుమార్తె ఆకుల ఐశ్వర్య (13) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తణుకులో ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ స్కూల్‌కి వెళ్తున్నారు. అయితే ఈ నెల 7న ఐశ్వర్య జన్మదినం సందర్భంగా నిడదవోలులో ఇంటికి వచ్చింది. తండ్రి ప్రసాద్‌బాబు చిన కుమార్తె ఐశ్వర్య బర్త్‌ డే సెలబ్రేషన్‌కు రూ. 8 వేలు పంపించారు. దీంతో ఐశ్వర్య కుటుంబ సభ్యులతో కలసి ఎంతో ఆనందంగా పుట్టిన రోజును జరుపుకొంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, 8న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ సమయంలో ఐశ్వర్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. తల్లి శాంత, కుటుంబ సభ్యులు కలసి ఐశ్వర్య మృతదేహాన్ని తమ సొంతూరు వీరభద్రపురానికి తీసుకువెళ్లారు. చిన కుమార్తె మృతి చెందిన సమాచారం తెలుసుకున్న తండ్రి ప్రసాద్‌బాబు నిడదవోలు వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి తణుకు వెళ్లి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement