వివాహిత ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Mar 10 2026 7:19 AM | Updated on Mar 10 2026 7:19 AM

యానాం: ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, స్థానికులు రక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం ద్రాక్షారామకు చెందిన పెట్టా సత్యలక్ష్మి స్థానిక బాలయోగి వారధి వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అందరూ చూస్తుండగానే గోదావరిలో దూకింది. వెంటనే స్థానికులు గమనించి గోదావరిలో వేటాడుతున్న మత్స్యకారులకు తెలపగా, వారు నావలపై వెళ్లి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం యానాం జీజీహెచ్‌కు తరలించగా, అక్కడి నుంచి ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై పునీత్‌రాజ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement