కలెక్టరేట్ సిబ్బందికి ఏఐ ఫైలింగ్‌పై వర్క్ షాప్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుని ఫైలింగ్ నిర్వహణ పద్ధతులను మెరుగు పరచడం వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌లో కలెక్టర్ షణ్మోహన్.. జేసీ అపూర్వ భరత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీని భాగం చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు చర్చించారు. వర్క్ షాప్‌లో భాగంగా ఏఐ టూల్స్‌ని ఎలా ఉపయోగించి మానవ తప్పులను తగ్గించుకోవాలి, కార్యాలయ పనితీరును మెరుగుపరచుకోవడానికి అనుసరించాల్సిన విధానాలపై కలెక్టర్ వివరించారు. కలెక్టరేట్‌లో పత్రాల నిర్వహణకు భవిష్యత్తులో సరైన మార్గదర్శకాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. వర్క్ షాప్‌లో సీపీవో పీ.త్రినాథ్, కలెక్టరేట్ ఏవో ఎస్.రామ్మోహన్‌రావు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.


