వడలు, గార్లు కాదు.. వడగర్లు! | - | Sakshi
Sakshi News home page

వడలు, గార్లు కాదు.. వడగర్లు!

Feb 26 2026 8:33 AM | Updated on Feb 26 2026 8:33 AM

వడలు,

వడలు, గార్లు కాదు.. వడగర్లు!

సఖినేటిపల్లి: పల్లిపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారులకు బుధవారం భారీగా మత్య్స సంపద లభించింది. వడగర్లు రకం చేపలు సుమారు రెండు టన్నులు వలకు చిక్కడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేజీ రూ.50 చొప్పున ఉంటుందని వారు తెలిపారు. మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు. ఈ మేరకు వీటి ఎగుమతికి ఐస్‌ బాక్సుల్లో భద్రపరిచే పనులను కొనుగోలుదారులు చేపట్టారు. అలాగే వలకు చిక్కిన భారీ సొర చేప 10 కేజీలు రూ.10 వేలకు పాటదారుడు చేజిక్కించుకున్నాడు.

వడలు, గార్లు కాదు..  వడగర్లు! 1
1/1

వడలు, గార్లు కాదు.. వడగర్లు!

Advertisement
 
Advertisement
Advertisement