మాదిగలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

మాదిగలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Mar 5 2026 7:25 AM | Updated on Mar 5 2026 7:25 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ బుధవారం కలెక్టర్‌ షణ్మోహన్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకులు కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. సామర్లకోట మండలం బోయినపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిని అరెస్ట్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు కొండేపూడి ఉదయ్‌కుమార్‌, మందపల్లి సత్యనారాయణ, కొడతా విజయ్‌కుమార్‌ కోరారు.

సత్యదేవుని దర్శించిన

కాశీ పీఠాధిపతి శ్రీ

శివనాగేంద్ర సరస్వతి స్వామి

అన్నవరం: కాశీ పీఠాధిపతి శ్రీ శివ నాగేంద్ర సరస్వతి గౌడపాదాచార్య స్వామీజీ బుధవారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వారికి ఆలయం వద్ద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేదాశీస్సులు అందచేసి స్వామివారి ప్రసాదాలు బహూకరించారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు

సీతానగరం: బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావు పేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన మాజీ భార్య, అత్త హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరు పర్చుతున్నట్లు కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి తెలిపారు. ఆయన బుధవారం సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు పాల్పడిన చోడదాసి సీతారామరాజు (పండు), అతడికి సహకరించిన స్నేహితులు, అదే గ్రామానికి చెందిన చోడదాసి రమేష్‌ (చిన్న), చిత్రపు అజయ్‌ కుమార్‌, కన్నెం సురేష్‌ (పెద్ద)లను అరెస్ట్‌ చేశామన్నారు. ఎస్సై డి.రామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement