ధర బాగున్నా.. | - | Sakshi
Sakshi News home page

ధర బాగున్నా..

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

ధర బా

ధర బాగున్నా..

నిమ్మ ధర బాగుంది. అయితే దిగుబడి లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటలు కాపులు కాయలేదు. ఎకరాకు 3 టన్నుల కాయలు దిగుబడి రావాల్సి ఉండగా, టన్ను కూడా లేవు. పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 100 కిలోల కాయలు కోయడానికి రూ. 2,200 ఖర్చు అవుతుంది. వేసవి పంటలపై ఆశలు పెట్టుకుంటాం. ఈ సారి ఆశాజనకంగా లేదు.

– గడా రాంబాబు, నిమ్మ రైతు,

చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

వేసవి పంటపైనే ఆశలు

వేసవి పంటపై ఆశలు పెట్టుకున్నాం. ప్రస్తుతం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం యాదవోలు మార్కెట్లో కిలో కాయలు రూ. 80 పలుకుతున్నాయి. డిసెంబర్‌, జనవరిలో కిలో ధర రూ. 8 ఉంది. ఈ నెలలో ధర పెరిగింది. ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేవు. నిమ్మ రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులు ఉన్నారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు.

– లకంసాని శ్రీనివాసరావు, నిమ్మరైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

ధర బాగున్నా.. 
1
1/1

ధర బాగున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement