అపర్ణాదేవీ నమామ్యహం
● కనుల పండువగా
సామూహిక కుంకుమ పూజలు
● పోటెత్తిన మహిళా భక్తులు
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో వేంచేసియున్న అపర్ణా సమేత నాగేశ్వరస్వామివారి కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కనుల పండువగా కుంకుమ పూజలు నిర్వహించగా వేలాదిగా మహిళలు పాల్గొన్నారు. కుంకుమ పూజలకు సుమారు మూడువేల మంది మహిళలు పోటెత్తారు. ఆలయ అర్చకులు ఆకొండి వెంకటేశ్వరశర్మ, ఆకొండి ప్రభాకరశాస్త్రిల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలతో ప్రత్యేక లక్ష కుంకుమార్చనలు, సహస్ర తులసిపూజ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
అపర్ణాదేవీ నమామ్యహం


