నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న కాకినాడ ఆర్‌ఎంసీ క్రీడా మైదానంలోని క్రికెట్ నెట్స్‌లో క్రీడాకారుల ఎంపికలు జరుపనున్నట్లు సంఘ కార్యదర్శి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. క్రికెట్ సంఘ అధ్యక్షుడు తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపికల్లో అండర్–23 బాలుర, బాలికలు, సీనియర్స్ విభాగంలో జట్టు ఎంపిక జరుగుతుందన్నారు. 2003 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగానికి అర్హులన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత ఽఅర్హత పత్రాలు, తెల్ల దుస్తులు, తెల్లబూట్లు ధరించి ఎంపికలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 90631 68999 నంబరులో సంప్రదించాలని కోరారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక రైల్వే ఎస్సై జి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తుని రైల్వే స్టేషన్ లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం శివారులో రైలు బండి ఢీకొనడంతో 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. రైల్వే సిబ్బంది అతనిని గుర్తించి 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, కాకీ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ఇతడి కుడి చేయి దండపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు, కుడిచాతిపై ఓం అనే పచ్చబొ ట్టు ఉంది. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌లో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు 92475 85731 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఎస్సై అన్నారు.


