అర్తమూరు మాజీ సర్పంచ్‌ భూలక్ష్మి మృతి | - | Sakshi
Sakshi News home page

అర్తమూరు మాజీ సర్పంచ్‌ భూలక్ష్మి మృతి

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

అర్తమూరు మాజీ  సర్పంచ్‌ భూలక్ష్మి మృతి

అర్తమూరు మాజీ సర్పంచ్‌ భూలక్ష్మి మృతి

కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం అర్తమూరు గ్రామ మాజీ సర్పంచ్‌ పడాల భూలక్ష్మి (61) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. 2001–06 మధ్య ఆమె సర్పంచ్‌గా పనిచేసి గ్రామానికి విశేష సేవలందించారు. ఆమెకు భర్త పడాల సుబ్బారెడ్డి, కుమారుడు భాస్కరరెడ్డి, కుమార్తె సత్యశ్రీ ఉన్నారు. భర్త పడాల సుబ్బారెడ్డి ప్రాంతీయ కోళ్ల రైతుల సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడుకు భూలక్ష్మి సోదరి. అర్తమూరులో భూలక్ష్మి పార్థివదేహాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు రాజకీయ, వ్యాపార, నియోజకవర్గ ప్రముఖులు సందర్శించారు. పడాల సుబ్బారెడ్డిని పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement