సత్యదేవునిపై భక్తి గీతాలు రాస్తా.. | - | Sakshi
Sakshi News home page

సత్యదేవునిపై భక్తి గీతాలు రాస్తా..

Mar 8 2026 7:25 AM | Updated on Mar 8 2026 7:25 AM

అన్నవరం: సత్యదేవుడు తనకు ఎంతో ఇష్టమైన దైవమని, స్వామివారిపై త్వరలో భక్తిగీతాలు రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ తెలిపారు. శనివారం ఆయన తన భార్య సుచిత్రతో కలసి రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వారికి ఆలయం వద్ద అర్చకులు సుధీర్‌ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు విచ్చేసిన ప్రతిసారీ సత్యదేవుని దర్శనం చేసుకుంటానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతోనే తాను మంచి గీతాలు రాయగలిగానని అన్నారు. సినీ గేయ రచయిత చంద్రబోస్‌ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందజేసి, స్వామివారి ప్రసాదాలు బహూకరించారు.

సినీ గేయ రచయిత చంద్రబోస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement