‘చోద్య’ ఆరోగ్యశాఖ! | - | Sakshi
Sakshi News home page

‘చోద్య’ ఆరోగ్యశాఖ!

Feb 26 2026 8:32 AM | Updated on Feb 26 2026 8:32 AM

‘చోద్య’ ఆరోగ్యశాఖ!

‘చోద్య’ ఆరోగ్యశాఖ!

కాకినాడ క్రైం: ఈ చిత్రం చూశారా..! ఇదేదో ఊరి శివారునున్న డంపింగ్‌యార్డ్‌ అనుకుంటున్నారా, కాదండోయ్‌. కాకినాడ నడిబొడ్డులో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణ! పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి–అనారోగ్యాలకు దూరంగా ఉండండి ఇదీ ఇక్కడి అధికారులు ప్రజలకిచ్చే పిలుపు. ఈ నినాదానికి ఏ మాత్రం సరిపోలదు అక్కడి ఆవరణ. అసలు మీరు చెప్పేదేంటి, మీ కార్యాలయ ఆవరణలో జరిగేదేంటి అంటూ ప్రశ్నిస్తాయి అక్కడి దుర్భర పరిస్థితులు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదురుగా ఉన్న మూడు చెత్త కంటైనర్లు చెత్తతో నిండిపోతున్నా మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడి ఆవరణంతా దుర్వాసన వెదజల్లుతూ దోమలు, ఈగలతో అత్యంత దుర్గంధ భరితంగా మారింది. అసలు జబ్బులన్నీ అక్కడే పుడుతున్నాయా అన్నట్టుంది పరిస్థితి. ఈ దుర్భర స్థితి నిత్యం కంటికి కనిపిస్తున్నా కార్యాలయ సిబ్బంది లేదా అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి ప్రజారోగ్యానికి పొగబెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement