ఏమన్నుకుండా వదిలేసి.. | - | Sakshi
Sakshi News home page

ఏమన్నుకుండా వదిలేసి..

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

ఏమన్నుకుండా వదిలేసి..

ఏమన్నుకుండా వదిలేసి..

అయినవిల్లి: అక్రమార్కులు లంకలపై పడ్డారు.. యథేచ్ఛగా మట్టి తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు.. పచ్చని పంటలను పండించే సారవంతమైన సొసైటీ భూములను కొంతమంది కాసులకు కక్కుర్తి పడి అమ్ముకుంటున్నారు. అయినవిల్లి మండలం మడుపల్లిలంక నదీ పరివాహక ప్రాంతంలో సొసైటీ భూముల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. అధికార అండతో కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రైతుల ఆధీనంలో ఉన్న సొసైటీ భూములను కొందరు డబ్బు ఎరచూపి ఎక్కడికక్కడే తవ్వేస్తున్నారు. గతంలో అయినవిల్లిలంకలో ఈ తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మడుపల్లిలంకకు ఈ అక్రమ దందా పాకింది. గోదావరి పాయ వెంబడి, ఏటిగట్టును ఆనుకుని ఉన్న భూములను మట్టి కోసం కొనుగోలు చేసి రాత్రిళ్లు యథేచ్ఛగా తవ్వుకుని పోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండి పోతుండడం గమనార్హం. ఈ పంట భూముల్లో కొబ్బరి, కూరగాయ, మొక్కజొన్న, మునగ, పుచ్చకాయలు, దోసకాయ, బొప్పాయి పంటలు పండించి ఎంతోమంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ఈ మట్టిని అక్రమంగా తరలించడం వల్ల మొత్తం పంట భూములు నదీ గర్భంలో అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో ఇక్కడ పండించడానికి భూములు లేక రైతులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండా లంకలను కొల్లగొడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రొక్లెయినర్ల సాయంతో భారీ లారీల ద్వారా కొత్తపేట, రావులపాలెంలలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇలా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫ లంకలను కొల్లగొడుతున్న మాఫియా

ఫ యథేచ్ఛగా మట్టి తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement