ఉల్లాసంగా.. ఉత్సాహంగా | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

Mar 1 2026 7:29 AM | Updated on Mar 1 2026 7:29 AM

ఉల్లా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

బీవీసీలో ముగిసిన యువజనోత్సవం

అమలాపురం రూరల్‌: అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి యువజనోత్సవం మయూక–2026 ఘనంగా ముగిసింది. రెండో రోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ హీరో నిఖిల్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు రూ. 5 లక్షల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీలను కళాశాల చైర్మన్‌ బోనం కృష్ణ సతీష్‌, బీవీసీ అక్షర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోనం విజయలక్ష్మి ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కబడ్డీ, వాలీబాల్‌ పోటీల్లో బీవీసీ ఓడలరేవు ప్రథమ స్థానం, కిమ్స్‌ అమలాపురం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాస్కెట్‌ బాల్‌లో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రథమ, ఆదిత్య డిగ్రీ కళాశాల ద్వితీయ, త్రోబాల్‌ మహిళా విభాగంలో బీవీసీ ఓడలరేవు ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు, కోకో మహిళా విభాగంలో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జేవీసీ రామారావు తెలిపారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో ప్రముఖ గాయకుడు రామ్‌ మిరియాల బృందం ఆలపించిన పాటలు అలరించాయి. బ్యాండు మేళం సినీ బృందం, హీరోయిన్‌ శ్రీదేవి, హీరో రోషన్‌, నిర్మాత కోన వెంకట్‌, దర్శకుడు సతీష్‌ పాల్గొని సందడి చేశారు. బీవీసీ గ్రూప్‌ అధినేత బోనం కనకయ్య, ప్రిన్సిపాల్స్‌ మహేశ్వర దత్తు, టీవీ జనార్దనరావు, మయూక కన్వీనర్లు కె.శ్రీనివాస్‌, బీఎస్‌ఎస్‌ ఫణిశంకర్‌, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జక్కం కృష్ణారావు పాల్గొన్నారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా 1
1/1

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement