తొలి తిరుపతిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

తొలి తిరుపతిలో భక్తుల రద్దీ

Feb 22 2026 7:15 AM | Updated on Feb 22 2026 7:15 AM

తొలి

తొలి తిరుపతిలో భక్తుల రద్దీ

పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండల పరిధిలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాలి నడకతో ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్న భక్తులు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను పూలతో సుందరంగా అలంకరించారు. సుమారు 12వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,78,750, అన్నదాన విరాళాలుగా రూ.50,125, కేశ ఖండన ద్వారా రూ.4,520, తులాభారం ద్వారా రూ.600, లడ్డూ ప్రసాదం విక్రయంతో రూ.20,565 కలిపి మొత్తం రూ.2,54,560 ఆదాయం ఆలయానికి వచ్చినట్టు చెప్పారు. ఆలయంలో 3,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్‌ మొయిలి సంధ్య, దేవస్థాన సిబ్బంది, భక్తులకు సేవలందించారు.

తొలి తిరుపతిలో భక్తుల రద్దీ1
1/1

తొలి తిరుపతిలో భక్తుల రద్దీ

Advertisement
 
Advertisement
Advertisement