breaking news
Magnetic fied
-
దేశీయంగా రేర్ ఎర్త్ తయారీకి దన్ను
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఉత్పత్తి కోసం ఉద్దేశించిన రూ. 7,280 కోట్ల స్కీముతో దేశీయంగా వాటి తయారీకి, సరఫరాకి ఊతం లభిస్తుందని పరిశ్రమ ధీమా వ్యక్తం చేసింది. తవ్వకం, వెలికితీత, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్, వివిధ రంగాలకు అవసరమయ్యే మ్యాగ్నెట్ల తయారీ వ్యవస్థకు ఈ పథకంతో గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భారతీయ ఖనిజ పరిశ్రమ సంస్థల సమాఖ్య ఎఫ్ఐఎంఐ పర్కొంది. దేశ వ్యూహాత్మక తయారీ సామర్థ్యాలను పటిష్టం చేసేందుకు ఈ ప్రోత్సాహక స్కీము తోడ్పడుతుందని అసోచాం సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్రక్టానిక్స్, మెడికల్ డివైజ్లు, పునరుత్పాదక విద్యుత్, రక్షణ తదితర రంగాల వృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో వార్షికంగా 6,000 టన్నుల (ఎంటీపీఏ) రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు ప్రయతి్నంచడమనేది సకాలంలో తీసుకుంటున్న చర్యగా ఆయన అభివరి్ణంచారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధిలో భారత్ మరింత ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సింఘాల్ వివరించారు. దీనితో మైనింగ్, ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ తదితర విభాగాలవ్యాప్తంగా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈవై ఇండియా పార్ట్నర్ రాజు కుమార్ తెలిపారు. -
చంద్రునిపై మచ్చలు ఎలా వచ్చాయో తెలుసా!
వాషింగ్టన్: రాత్రిళ్లు ఆకాశంలోకి చూసినపుడు మనకు ఎప్పుడో ఒక్కసారైన చిన్న అనుమానం వచ్చి ఉంటుంది.. అదే చంద్రుని మీద ఉన్న ఆ మచ్చలు ఎలా వచ్చాయి? అని.. ఆ మచ్చల వెనుక కథను నాసా ఇప్పుడు బయటపెట్టింది. మరీ ఆ మిస్టరీ వెనుక దాగున్న నిజాలను చూద్దాం.. చంద్రుడి గురించి మనకు ఇప్పటివరకు ఏం తెలుసు..? రాత్రి పూట కాకుండా పగలు కూడా చంద్రుడు కనిపిస్తాడనీ, ఇంకా మరికొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసు. చంద్రుడి మీద మనకు కనిపించే తెలుపు, నలుపు మచ్చలు దాదాపు వందకు పైగా ఉన్నాయి. నాసా చేపట్టిన లూనార్ రీకొన్నైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) మిషన్ కు నేతృత్వం వహించిన కెల్లర్ అనే శాస్త్రజ్ఞడు తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడి మీద మచ్చలు చాలా పెద్దవిగా గుంపుగా ఉంటాయి. ఎలా ఏర్పడ్డాయి.. చంద్రునిపై మచ్చలు ఏర్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. చంద్రుడు ఏర్పడే పరిణామక్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు. దీని కారణంగా చంద్రుని మీద ఉండే శిలాజాలు నల్లని మచ్చలుగా కనిపిస్తాయి. అలాగని చంద్రుని మీద ఉన్న ప్రతి ఒక్క శిలాజం మచ్చగా కనిపించదు. అయస్కాంత క్షేత్రం బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే మచ్చలు తయారవుతాయి. చంద్రుడు సూర్యుని నుంచి శక్తిని గ్రహించుకుని రాత్రిపూట వెలుగునిస్తాడని మనకు తెలుసు. అలా సూర్యుని నుంచి వచ్చే వేడి గాలుల వల్ల అయస్కాంత క్షేత్రాలు ప్రభావితం చెంది బలమైన విద్యుత్ క్షేత్రాలను తయారుచేశాయి. ఈ విద్యుత్ క్షేత్రాలు వేడిగాలలతో ప్రభావం చెంది ఎక్కువ కాంతిని బయటకు ప్రసరించేలా చేస్తాయి. అందుకే చంద్రుని మీద మనకు కనిపించే కొన్ని మచ్చలు తెల్లగా ఉంటాయి.


