
జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్ నియామకం
రాష్ట్రపతి ముర్ముఉత్తర్వులు.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
వచ్చే వారం ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాశ్వత న్యాయమూర్తులుగా వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వచ్చే వారం ప్రమాణం చేయించనున్నారు.
జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్‌లు 2023 అక్టోబర్ 21న హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఆ పదవీ కాలం అక్టోబర్ 20వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరి నియామకంతో హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 24కి చేరింది.