ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యుచువల్ ఫండ్ సంస్థ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (సిఫ్) విభాగంలో రెండు కొత్త ఫండ్స్‌ని ప్రవేశపెట్టింది. ఐసిఫ్ ఈక్విటీ ఎక్స్-టాప్ 100 లాంగ్-షార్ట్ ఫండ్, ఐసిఫ్ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు జనవరి 30 వరకు అందుబాటులో ఉంటాయి.
మొదటిది ఎక్స్-టాప్ 100 స్టాక్స్, వాటి సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లాంగ్–షార్ట్ పొజిషనింగ్, డెరివేటివ్ వ్యూహాలతో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక రెండోది ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ పొజిషన్లలో లాంగ్-షార్ట్ పొజిషన్లు, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాలు, డెరివేటివ్ వ్యూహాలతో మార్కెట్ దిశతో సంబంధం లేకుండా మెరుగైన రాబడులు అందించేందుకు ప్రయత్నిస్తుంది.
మ్యుచువల్ ఫండ్స్, పీఎంఎస్/ఏఐఎఫ్ సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసే దిశగా సెబీ ఈ సిఫ్ సెగ్మెంట్‌ని ప్రవేశపెట్టింది. దీనికి కనీస పెట్టుబడి రూ. 10 లక్షలుగా ఉంటుంది. వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనపర్చే వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహాలను ఇన్వెస్టర్లకు అందించే లక్ష్యంతో వీటిని ప్రవేశపెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు.


