రష్యాకి చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ శుభకర్ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.
వీటిని పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్ వివరించారు.


