న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) అమెరికా రక్షణ రంగ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఎంకే1ఏ కార్యక్రమం కింద తేజస్ విమా నాలకు అవసరమైన 113 జెట్ ఇంజిన్లను కొను గోలు చేయనుంది. భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50%టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన వేళ ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. రూ.8,870 కోట్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం జీఈ ఏరోస్పేస్ సంస్థ ఎఫ్404–జీఈ–ఐఎన్ 20 రకం ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌కు 2027–2032 సంవత్సరాల మధ్య అందజేయాల్సి ఉంటుంది.


