అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రైలు ప్రయాణంలో మార్పులు! | Indian Railways revamping Amrit Bharat Express from January 2026 | Sakshi
Sakshi News home page

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రైలు ప్రయాణంలో మార్పులు!

Jan 20 2026 1:20 PM | Updated on Jan 20 2026 1:26 PM

Indian Railways revamping Amrit Bharat Express from January 2026

భారతీయ రైల్వే సామాన్య ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను చేరువ చేస్తూ తీసుకువచ్చిన ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ సేవల్లో కీలక మార్పులు చేసింది. అమృత్‌ భారత్ రైళ్లలో టికెట్ బుకింగ్ విధానం, ఛార్జీల నిర్మాణం, రిజర్వేషన్ నిబంధనల్లో కొత్త మార్పులు అమలులోకి తీసుకొచ్చింది.

ఆర్‌ఏసీ విధానానికి స్వస్తి

అమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రైళ్లలో ఆర్‌ఏసీ విధానం ఉండదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో అది నేరుగా కన్ఫర్మ్ అవుతుంది లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. దీనివల్ల సీటు షేర్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణం మరింత సుఖమయంగా ఉంటుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రయాణించే అవకాశం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

ఛార్జీలు ఇవే..

రైల్వే ఆదాయం, సర్వీసుల నాణ్యతను సమతుల్యం చేస్తూ కనీస ఛార్జీలను నిర్ణయించింది. కనీసం 200 కిలోమీటర్ల దూరానికి టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. దీని బేసిక్ ఛార్జీ రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. సెకండ్ క్లాస్ (అన్‌రిజర్వ్డ్) కేటగిరీలో కనీసం 50 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ వసూలు చేస్తారు. దీని ప్రారంభ ధర రూ.36. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

అమృత్ భారత్ vs వందే భారత్.. ప్రధాన వ్యత్యాసాలు

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌
సామాన్యులకు తక్కువ ధరలో ప్రయాణంప్రీమియం, వేగవంతమైన ప్రయాణం
నాన్-ఏసీ(స్లీపర్, సెకండ్ క్లాస్)పూర్తిగా ఏసీ (చైర్ కార్, స్లీపర్)
ఆర్‌ఏసీ లేదు (కన్ఫర్మ్ లేదా వెయిటింగ్)కేవలం కన్ఫర్మ్ టికెట్లు
మెరుగైన బెర్త్‌లుఆటోమేటిక్ డోర్లు, వై-ఫై, క్యాటరింగ్

 

దేశవ్యాప్తంగా కొత్త మార్గాలు

కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో రైల్వే శాఖ మరో 9 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ప్రధానంగా ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.

కామాఖ్య - రోహ్‌తక్: అస్సాం నుంచి హర్యానా వరకు.

దిబ్రూగఢ్ - లఖ్‌నవూ: యూపీ, అస్సాం మధ్య.

సంత్రాగాచి - తాంబరం: కోల్‌కతా, చెన్నై మధ్య.

హౌరా - ఆనంద్ విహార్ (ఢిల్లీ): కోల్‌కతా నుంచి ఢిల్లీ. ఇవేకాక ఇతర ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement