క్యూ3లో రూ. 6,654 కోట్లు
ఆదాయం రూ. 45,479 కోట్లు
5,043 మందికి ఉద్యోగాలు
ఆదాయ అంచనాల పెంపు
ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పన
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 2 శాతం క్షీణించి రూ. 6,654 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో రూ. 1,289 కోట్లమేర వన్‌టైమ్ కేటాయింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,806 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం ఎగసి రూ. 45,479 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 41,764 కోట్ల టర్నోవ ర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 9.6 శాతం క్షీణించగా.. ఆదాయం 2.2 శాతం పుంజుకుంది.
ఏఐలో ముందంజ
ఎంటర్‌ప్రైజ్ ఏఐలో ప్రత్యేకత కలిగిన విలువ ఆధారిత సరీ్వసులను టోపజ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీకున్న నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు, పటిష్ట డెలివరీ సామర్థ్యాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. దీంతో ఇన్ఫోసిస్‌ను తమ భాగస్వామిగా ఎంచుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించి షేర్ల బైబ్యాక్‌తో పాటు వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను సైతం చెల్లించింది. గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు సీఎఫ్‌వో జయేష్ ఎస్. పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే 18,000 మందికి ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు.
ఇతర విశేషాలు
→ తాజా సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ 4.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. వీటిలో 57 శాతం కొత్తగా సాధించిన ఆర్డర్లు కావడం గమనార్హం!
→ యూకే నేషనల్ హెల్త్ సరీ్వస్‌తో 1.6 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ అందుకుంది.
→ మార్చితో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 3–3.5 శాతానికి మెరుగుపరచింది. ఇంతక్రితం 2–3 శాతం ఆదాయ వృద్ధిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
→ 2025 డిసెంబర్ 31కల్లా 5,043 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,37,034కు చేరింది.
→ కంపెనీ సీఈవో పరేఖ్‌కు రూ. 3 కోట్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాల(ఆర్‌ఎస్‌యూలు) కేటాయిం చేందుకు బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.
→ కొత్త కారి్మక చట్టాల ప్రభావంతో ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్ రూ. 2,128 కోట్లు, హెచ్‌సీ ఎల్ టెక్నాలజీస్ రూ. 719 కోట్లు చొప్పున క్యూ3 లో కేటాయింపులు చేపట్టిన విషయం విదితమే.
ఇన్ఫోసిస్ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 1,599 వద్ద ముగిసింది.
Infosys (755691)third quarter (774541)consolidated (755785)net profit (75578


