
ఎముకల ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనది. వయసు పెరిగేకొద్దీ ఎముకలు సాంద్రతను కోలపోతాయి. పైగా పగుళ్లు ఏర్పడి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎముకలను బలహీనపర్చడాన్ని వేగవంతం చేస్తాయి. తరుచుగా గాయలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటుందోని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైద్యలు మాత్రం ఇండియన్ డైట్‌తోనే నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఎముక ఆరోగ్యాన్నికాపాడంలో భారతీయ ఆహారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయిని చెబుతున్నారు. పైగా అవి అందుబాటులో ఉండే ఆహారాలేనని అంటున్నారు. అంతేకాదండోయ్ బలమైన ఎముకల బెస్ట్ ఇండియన్ ఫుడ్ గైడ్ ఏంటో కూడా వివరించారు. మరీ అవేంటో తెలుసుకుందామా..!.
కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు
ఎముకల బలానికి కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. పెద్దలకు రోజుకు 1000–1200 mg కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో సహజంగానే అనేక కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు ఉన్నాయి.
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ , మజ్జిగ వంటివి కాల్షియం అద్భుతమైన వనరులు.
ఆకుకూరలు: పాలకూర (పాలక్), మెంతులు (మేథి), ఉసిరి వంటి మొక్కల ఆధారిత కాల్షియం
నువ్వులు: భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే నువ్వులు (టిల్) గింజలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి.
రాగి: సాంప్రదాయ భారతీయ ధాన్యం, రాగులు కాల్షియంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి.
అంటే పైన చెప్పిన వాటిల్లో కనీసం ఒక గ్లాసు పాలు లేదా మజ్జిగ తీసుకున్నాచాలు కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.
మెరుగైన కాల్షియం శోషణకు విటమిన్ డి
కాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. సూర్యరశ్మికి గురికావడం ఉత్తమ సహజ వనరులే కానీ ఫుడ్ పరంగా ఏవంటే..
గుడ్డు పచ్చసొన
సాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలు
బలవర్థకమైన పాల ఉత్పత్తులు
పుట్టగొడుగులు
ఇక్కడ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో గడిపే యత్నం చేయటం వంటివి చేస్తే చాలు.
ఎముక ద్రవ్యరాశికి ప్రోటీన్
ప్రోటీన్లు ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఆహారాంలో ప్రోటీన్ని జోడిస్తే ఈ ఎముకల సమస్యను అధిగమించొచ్చు.
పప్పుధాన్యాలు, కాయధాన్యాలు (పప్పు, రాజ్మా, శనగ, మూంగ్)
పాల ఉత్పత్తులు
బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, విత్తనాలు
లీన్ మాంసాలు, గుడ్లు
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎముక సాంద్రతను పెంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులు
ఎముక సాంద్రతకు మెగ్నీషియం, ఫాస్ఫరస్
ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్ కూడా కీలకమే. ఈ ఖనిజాలు అధికంగా ఉండే భారతీయ ఆహారాలలో ఇవి ఉన్నాయి:
అరటిపండ్లు, అంజూర పండ్లు, ఖర్జూరాలు
గోధుమ బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలు
జీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలు
గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు
ఎముకలకు హాని కలిగించే ఆహారాలు..
పోషకాలు అధికంగా ఉండే ఆహారం కీలకం అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని విషయం గ్రహించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు
తినకూడనవి..
చక్కెర పానీయాలు
శీతల పానీయాలు
ఎముకల నుంచి కాల్షియం లీక్ అయ్యే అధిక ఉప్పు
అధిక మొత్తంలో కెఫిన్
నడక, జాగింగ్, బరువు మోసే వ్యాయామాలు, సమతుల్య ఆహారం తదితరాలు జీవితాంతం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందువల మనకు అందుబాటులో ఉండే ఈ సాధారణ ఆహారాలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)