
ప్రేమ విఫలం లేదా మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి దూరమవ్వడం, లేదా నమ్మకద్రోహం వంటి వాటి వల్ల హృదయం ముక్కలైపోతుంది. అది సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే కొందరు గుండెను రాయి చేసుకుని ధైర్యంగా లైఫ్‌ని లీడ్ చేస్తే..మరికొందరు అంత తేలిగ్గా ఆ సమస్య నుంచి బయటపడరు. పైగా గుండె బలహీనమైపోయి..తాత్కాలికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీన్ని వైద్య పరిభాషలో టాకోట్సుబో కార్డియోమయోపతి లేదా "బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్"గా వ్యవహరిస్తారు. అయితే అలా ముక్కలైన హృదయాన్ని బాగు చేసుకుని, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చట. పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అసలేం జరిగిందంటే..ప్రపంచంలో లక్షలాది మంది ఈ టాకోట్సుబో కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా అకస్మాత్తుగా గుండె కండరాలు బహీనపడిపోయి గుండెపోటు లక్షణాలు తలెత్తుతాయట. చెప్పాలంటే మరణ ప్రమాదానికి చేరవయ్యే ప్రమాదం ఎక్కువ అవ్వుతుందట. ఇలాంటి తాత్కాలిక గుండెపోటు ప్రమాదాల నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నారు మాడ్రిడ్ పరిశోధకులు.
ఒక్కోసారి ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి గుండెపోటు సిండ్రోమ్‌ని నివారించే దిశగా అధ్యయనాలు చేయగా, వ్యాయామమే చక్కటి నివారణ అని తేలిందన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే వ్యాయామలు, థెరపీలు ఆయా రోగులకు అందివ్వగా మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 76 మంది రోగులపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు.
వారిలో 66 ఏళ్లు పైబడ్డ మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. వారందరిని రెండు సముహాలుగా విభజించారు. ఒక సముహం సాధారణ వ్యాయామాలు, వాకింగ్ చేయగా, మరొక సముహానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీలో భాగంగా ఆయా వ్యక్తులకు 12 టు 1 సెషన్‌లో జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలాహ్యాండిల్ చేయాలి, అవన్నీ జీవితంలో ఏ విధంగాభాగం తదితరాలపై శిక్షణ ఇస్తారు.
ఇలా మొత్తం 12 వారాలు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇక వ్యాయామాల్లో భాగంగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్‌తో కూడిన వ్యాయామాలను 12 వారాలు తర్ఫీదుని మిగతా సగంమందికి ఇచ్చామని చెప్పారు. ఫలితంగా వారందరీ గుండె పనితీరు మెరుగ్గా ఉండటమే గాక గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గినట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు వారందరిలోనూ ఆక్సిజన్ వినియోగించే సామర్థ్యాన్ని మెరుగుపరచారని చెప్పారు.
ఇలాంటి తాత్కాలిక గుండె సంబంధిత సమస్యలను కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా వ్యాయామాలతో నయం చేయగలవని అన్నారు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొద్దిపాటి జీవన శైలి మార్పులు, శారీరక శ్రమతో కామన్ మ్యాన్ కూడా ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలరని అన్నారు. ఈ పరిశోధన మరిన్ని వ్యాధులకు సంబంధించిన అధ్యయనంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్డియాలజీ పరిశోధకులు.
(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!)