పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఇవే..! | Neha Shetty Inspires Impeccable Fashion Goals | Sakshi
Sakshi News home page

Neha Shetty: పాలరాతి శిల్పంలా ఉండే నేహా శెట్టి ఇష్టపడే ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఇవే..!

Apr 13 2025 8:14 AM | Updated on Apr 13 2025 10:06 AM

Neha Shetty Inspires Impeccable Fashion Goals

‘లైఫ్‌లో గోలా ఉండాలి, గోలూ ఉండాలి..’ అన్నట్లు కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా, సరదాగా గడపటం, అందంగా కనిపించడం ముఖ్యం. అందుకే, నటి నేహా శెట్టి ఇంట్లో ఉన్నా, స్టేజ్‌ మీద ఉన్నా, స్క్రీన్‌ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ఆమె ఎంచుకున్న కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ మీ కోసం.. 

ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయటం ఇష్టం. వాటివల్లే చాలా నేర్చుకున్నా. సడన్‌గా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్‌ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల ఉంగరాలు, ఇయర్‌ రింగ్స్‌ కలెక్షన్స్‌ ఉంటాయని అంటోంది నేహా శెట్టి.

మహిళ అందాన్ని పెంచడంలో ముందు ఉండే ఆభరణమే ముక్కెర. ఇది ఒకప్పటి ఓల్ట్‌ ఫ్యాషన్‌. కాని, ఇప్పుడు ఓల్ట్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే రేంజ్‌లో స్టయిలింగ్‌లో దూసుకొచ్చి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులనూ దోచేస్తోంది. ట్రెండింగ్‌ ఆభరణం కావడంతో మార్కెట్‌లో ఇవి రకరకాల డిజైన్స్, మెటల్స్‌లో లభిస్తున్నాయి. 

అయితే, వీటిని కొనేటప్పుడు ముక్కుపుడకలో ఉన్న రాళ్లు, వజ్రాలను బాగా పరిశీలించి, ఊడిపోకుండా ఉండే రాళ్ల ముక్కు పుడకలను కొనుక్కోవాలి. ఆ స్టోన్స్‌ పోతే చూడ్డానికి అస్సలు బాగోదు. కొంతమందికి చిన్న ముక్కు, కొందరికి పెద్ద ముక్కు ఉంటుంది. ముక్కుకు తగ్గ సైజు ముక్కు పుడకను ఎంచుకోవాలి. 

ఒకసారి ముక్కుకి పెట్టుకొని అది మీకు నప్పుతుందా లేదా అని చూసుకొని తీసుకోవటం మంచిది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ ప్రెస్డ్‌ నోస్‌ రింగ్స్‌దే. ఇది ముక్కు కుట్టించుకోని వారు కూడా ధరించి మురిసిపోతున్నారు. పైన చూపించిన నటి నేహా శెట్టిలా.  ఇక ఇక్కడ నేహా ధరించిన జ్యూలరీ.. 
ఇయర్‌ రింగ్స్‌ బ్రాండ్‌: సంస్కృతి సిల్వర్‌ ధర: రూ. 8,600, ఉంగరం బ్రాండ్‌: తంత్ర బ్రాస్‌ జ్యూలరీ ధర: రూ. 450, కాగా, చీర బ్రాండ్‌: సురుమయే ధర: రూ. 22,000/-
 

(చదవండి: నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్‌..ధర తెలిస్తే షాకవ్వుతారు..!)

Advertisement
 
Advertisement
Advertisement