
ఒకప్పుడు పుస్తకాలు తెగ చదివేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి ఒక పుస్తకం చదవడం కూడా కష్టమైంది’ అనే మాట వింటుంటాం. పుస్తకం పఠనం అనేది విలువైన అభిరుచి. ఆ అభిరుచిని ఎప్పటిలాగే కొనసాగించడానికి...
ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకంతో మీ రెండో ప్రయాణం ప్రారంభించండి. టీవిలో మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ‘థ్రిల్లర్’ నవలతో రంభించండి. పెద్దపెద్ద పుస్తకాలతో కాకుండా చాలా చిన్న పుస్తకాలతో చదవడం మొదలుపెట్టండి. ‘రోజుకు ఇన్ని పేజీలు’ అని నిర్ణయించుకొని వాటిని మెల్లగా పెంచుతూ పోవాలి.
మీతో పాటు ఎప్పుడూ ఒక పుస్తకం ఉండాలి. బయట ఎక్కడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు, వెయిటింగ్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ చూడడం కాకుండా పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. పుస్తక పఠనం అనేది సోలో హాబీ మాత్రమే కాదు. ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.
రెండు మూడు రోజులు కావచ్చు. వారం కావచ్చు...‘రీడింగ్ టైమ్’ అని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. కాస్త మార్పు కోసం, ఆసక్తి కోసం కొంత టైమ్ ఫిజికల్ బుక్స్ నుంచి ఇ–బుక్స్‌కు మారండి.