
మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం నుంచి పలు ముఖ్యమంత్రులను, అధికారులను కలుస్తూ అత్యంత బిజీగా ఉంటారామె. హోదా రీత్యా అత్యంత బిజీ బిజీ పనులతో సాగుతుంటుంది ఆమె జీవితం. అంతటి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఆమె చాలా చక్కటి జీవనశైలిని అవలంభిస్తారామె. క్రమశిక్షణాయుత జీవనశైలికి కేరాఫ్ అడ్రస్ ఆమె. మరి అంతలా ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చే ద్రౌపది ముర్ము తన రోజుని ఏవిధంగా ప్రారంభిస్తారో తెలుసుకుందామా..
ఢిల్లీలోని ప్రాంతాలన్ని ఉయాన్ని రణగణ ధ్వనులతో బిజిబిజీగా ప్రారంభమవ్వగా ద్రౌపది ముర్ము రోజు ఉదయం ఆరుతో ప్రారంభమవుతుంది. ఆమె ఉదయం మేల్కొన్న వెంటనే రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో ఉండే అమృత ఉద్యాన్ అనే పచ్చటి తోటలో వాకింగ్‌కు వెళ్తారు.
అక్కడ మంచుగడ్డిపై నడుస్తూ..చుట్టు ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కాసేపు అలా కలియదిరుగుతారు. ఆ తర్వాత ఓ రెండు గంటపాలు ధ్యాన సెషన్ ఉంటుంది. తనలోకి తాను అవలోకనం చేసుకునే ఈ ధ్యాన ప్రక్రియలో ఆ రోజు తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలకు తనను తాను సిద్ధం చేసుకుంటారామె. నిపుణుల సైతం ధ్యాన ప్రక్రియ వల్ల బాధ్యతలను చురుకైన మేధాస్సుతో వేగవంతంగా చక్కబెట్టగలరని చెప్పడమే గాక పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అందుకే ప్రధాని మోదీ సైతం ప్రజలకు విజ్ఞిప్తి చేసేది ఇదే.
ధ్యాన నిమగ్నులమై మన పూర్వీకుల మాదిరి దీర్ఘాయువుని పొందుదాం అని సదా పిలుపునిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ధనవంతులు, సెలబ్రిటీలు ప్రముఖులు నుంచి అత్యున్నత హోదాల్లో పనిచేసే వారు వరకు అంతా ధ్యాన ప్రక్రియకే అగ్రతాంబులం ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత ముర్ము ఆ 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోట మొత్తం కవర్ చేసేలా రెండు కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ..అక్కడే ఉంటే నెమళ్లను పలకరించి సేద తీరతారు. ఆ తదుపరి భాద్యతల్లో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధమవుతారు.
ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్‌లోని కారిడార్ల గుండా అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పలు కీలకమైన జాతీయ పత్రాలపై సంతకం చేసి, ప్రముఖులను, రాష్ట్ర అతిథులను కలవడం వంటివి చేస్తారు. అక్కడే అతిథులతో కీలకమైన చర్చలు జరపడం, సమావేశమవ్వడం వంటి పనులు జరుగుతాయి. అయితే ఈ అధ్యక్ష భవనంలోకి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ఎవరెవరంటే..ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, మాజీ అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్ తదితరులు.
ఒక పక్క తన వ్యక్తిగత జీవితాన్ని, బాధ్యతలను క్రమశిక్షణాయుతంగా నిర్వర్తిస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటారామె. అందుకు ఉపకరించేవి కాసింత వ్యక్తిగత విశ్రాంతి సమయమే ఆమెను శక్తిమంతంగా రీచార్జ్ చేసి కార్యోన్ముఖురాలిగా మారుస్తుంది. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కి అసలైన అర్థం. పైగా సమతుల్యత తినే ఆహారంలోనే కాదు..మన జీవన విధానంలో కూడా అవసరమే అన్న సత్యాన్ని ఎలుగెత్తి చెబుతోంది కదూ..!. అంతేగాదు అత్యంత బిజీ అనే పదం ఉపయోగించే వారందరికీ ఇలాంటి మహోన్నత వ్యక్తుల దినచర్యే ఒక ప్రేరణ.
(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..)