వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్‌: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Reacts Tdp Mp Putta Mahesh Case | Sakshi
Sakshi News home page

వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్‌: వైఎస్‌ జగన్‌

Mar 17 2026 3:30 PM | Updated on Mar 17 2026 4:37 PM

Ys Jagan Reacts Tdp Mp Putta Mahesh Case

సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్‌తో మొదలై... పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మీద నో యాక్షన్‌.

..మహిళలతో అశ్లీల వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే మీద నో యాక్షన్‌. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ మీదా నో యాక్షన్‌. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్‌. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్‌. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

‘‘తన కొడుకు స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌లు చూస్తే నో యాక్షన్‌. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్‌. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్‌ సెట్‌ లేదు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement