అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్‌

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్‌

చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి రాజధాని ప్రాంతం నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిని పెద్ద పెద్ద లారీలలో తీసుకువచ్చి చేబ్రోలు ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతం నీరుకొండ నుంచి ఐదు టర్బో లారీలలో మట్టి తీసుకువచ్చి స్థానిక జీబీసీ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో మెరక చేస్తుండటంతో కొంతమంది పోలీసులకు, రెవెన్యూ, అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారుజామున మట్టిలోడ్‌తో వచ్చిన లారీలను స్థానిక ఎస్‌ఐ పి.వీరనారాయణ ఆధ్వర్యంలో సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. మొత్తం ఐదు లారీలకు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా చేబ్రోలు పరిసర గ్రామాల్లో మట్టిని పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడకు తరలించి బ్రోకర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడ్డ లారీలు అధికార పార్టీకి చెందిన వారివి కావటంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

రాజధాని ప్రాంతం నుంచి చేబ్రోలుకు

తరలిస్తున్న అధికార పార్టీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement