గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ ఉమ్మడి గుంటూరు జిల్లా విభాగానికి నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షురాలిగా ఎన్. నిర్మల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో సంఘ ప్రధాన కార్యదర్శిగా పి. శామ్యూల్ పాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎల్‌ఎల్‌వీ. ప్రతాప్, కోశాధికారిగా ఎల్. రవీంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా వి. గణేష్ కుమార్. ఎస్. పురుషోత్తం రాజు, బి. నాగేశ్వరరావు నాయక్. జి.వి.ఆర్.ఏ. శేషారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, ఎం. బుల్లయ్య, ఎస్‌కే. నీలోఫర్, వి. పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి గా ఆర్. శివరామయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి. శ్రీనివాసరావు, కె. మోహన్ రావు, వి. చంద్ర మోహన్, కె. విద్యాసాగర్ రెడ్డి, జేఏసీ సభ్యుడిగా బి. మధుసూదన్ ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితులుగా బి.సిరిల్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు షేక్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షురాలు నిర్మల భారతి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీసీ చంద్రమోహన్ పూర్ణ చంద్ర రెడ్డి, రామచంద్రరావు, తోట ఉషాదేవి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.


