గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం సంస్థ వ్యవస్థాపకులు పొత్తూరు సుబ్బారావు, జయలక్ష్మిల ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు శనివారం సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి పర్యావరణ రచయిత డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కవులు, రచయితలు సామాజిక స్పృహతో రచనలు చేయాలన్నారు. కార్తికా డెవలపర్స్ అధినేత వి.వి రాఘవరెడ్డి, జల్ది విద్యాధరరావులు ప్రసంగించారు. విడుదల నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు ప్రముఖ రంగస్థల నటులు, రచయిత విడుదల సాంబశివరావు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ కథా రచయిత్రి తాటికోల పద్మావతి రచించిన కథా పద్మాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనాన్ని ప్రముఖ రచయిత వడలి రాధాకృష్ణ నిర్వహించారు. సయ్యద్ జానీబాషా, బండికల్లు జమదగ్ని, ఎస్.ఎం సుభాని, వీఎస్వీ ప్రసాద్, సోమేపల్లి వశిష్ట, కొణతం నాగేశ్వరరావు, దార్వేముల అనిల్, సుభద్రాకృష్ణ, సుబ్బయమ్మ, పుల్లారావు, శ్రీనివాసరావులు కవితా పఠనం చేశారు. వివిధ రంగాలలో పేరు పొందిన చలపాక ప్రకాష్ (పత్రికా రంగం), కడియాల ప్రభాకరరావు (సంగీతం), రాసంశెట్టి నరసింహారావు(గాయకులు), వై. కనకదుర్ (సాహిత్యం), అత్తోట సౌజన్య (గాయని)లను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. కథల పోటీలలో విజేతలైన ఇంద్రగంటి మధుసూదన్‌రావు, మొగిలి పద్మ, మౌనశ్రీ మల్లిక్, కోరాడ అప్పలరాజు, చిట్యాల శ్రీధర్‌కుమార్, పట్నాల ఈశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి, ఎం సత్యగౌరీ, బీవీ మిత్ర కొత్తూరు సీతారామరాజు, సి రాజేశ్వరి, కిషోర్ కుమార్‌లకు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ వ్యాఖ్యాత పెద్దూరి దాసు సభా సమన్వయం చేశారు. వేడుకలు పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం పత్రిక కార్యాలయంలో పొత్తూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొంచెం కావాలిపుడు శీర్షికన కవితా గానం చేసిన ఎస్. ఎం. సుభానిని జాస్తి వీరాంజనేయులు శాలువాతో సత్కరించారు. ప్రముఖ సాహితీ వేత్త పెద్దురి వెంకటదాసు, ప్రముఖ కథా రచయిత వడలి రాధాకృష్ణ, పట్టాభి కళాపీఠం అధ్యక్షులు తూములూరి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ కవి రచయిత డాక్టర్ జెల్ది విద్యాధరరావు, జమదగ్ని, వశిష్ఠ సోమేపల్లి, సయ్యద్ జానీబాషా, తాటికోల పద్మావతి, ఎం. సుభద్రకృష్ణ, ప్రముఖ సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, ముట్లూరి ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్. దమయంతి తదితరులు సుభానికి అభినందనలు తెలిపారు.


